పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగణించాలి.

పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగణించాలి.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారి సూచనల మేరకు లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ జనసేన పార్టీ నిర్వహించిన ఒక సమావేశం లో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ వచ్చినప్పటినుండి మీడియా ప్రతినిధులు ఎంతో ధైర్యంగా భిన్న కోణాల్లో వార్తలు కథనాలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో, కోవిడ్ కేంద్రాలలో, ల్యాబ్ లో ఇలా పలు ప్రదేశాల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వం పాత్రికెయమిత్రులకు కరోనా విషయంలో తీసుకోవాల్సిన వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి వారికి ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించడం లేదని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు ఆరోగ్య బీమా కార్డులు అన్ని ఆస్పత్రిలో అంగీకరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి అని కరోనా గురించి జాగ్రత్తలు చెప్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. పాత్రికేయులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వైరస్ బారిన పడుతున్నారు కొందరు కన్నుమూయడం చాలా బాధాకరం పాత్రికేయులను కూడా ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగణించాలి. అలాగే ప్రెస్ అకాడమీ ద్వారా వారికీ ఆర్థిక సహాయం అందించాలి అని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

See also  జనసేన నాయకులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి