నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు కలుజు పై బ్రిడ్జి నిర్మాణం చేపడతానని తెలిపిన ప్రసన్న దానిని పట్టించుకోవడం మర్చిపోయాడు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకల కిషోర్ ఉపాధ్యక్షుడు సుధీర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా మీరు వింటారని వెంటనే ప్రెస్ మీట్ లు పెట్టి పాయింట్ టు పాయింట్ విమర్శిస్తారు. అనుచరులు వందల కోట్లు మునిగిపోతుంటే గమనించుకొని ఎర్రిబాగుల ప్రసన్న కి వారాహి చూసి మతిభ్రమించినట్లు ఉంది. ఈ పెద్ద మనిషి ప్రసన్న కోవూరు కలుజుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతానని ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చి మాట తప్పుతాం మెడం తిప్పుతాం అనే తమ నానుడి నాచరించాడు. వరదలప్పుడు దీని పై గతం లో ప్రాణనష్టం కూడా జరిగిన సంగతి విధతమే. మొన్ననేగండవరంలో 200 మంది పేదలకు ఇల్లు పట్టాలిచ్చారు. కనీసం సర్వే లేదు హద్దులు లేవు రెండు ఎకరాలు దాదాపుగా 200 మందికి పంచి ఇచ్చారు అంటే ఒక్కొక్క మనిషికి రోడ్లు అవి పోను 5 అంకణాలు లోపు ఉండే పరిస్థితి. అనేక ఎకరాలకు పొలాలకు నీరుందించే కోవూరు మల్దేవు గుర్రపు డెక్కలతో నిండిపోయి నీటి పకరుదల లేక ఇబ్బందిగా ఉంటే, పూడిక పనులు కూడా చేయించలేరు. వీటి గురించి ఏమన్నా ప్రశ్నిస్తే అనుచరులు వచ్చి ఎకరానికి ఎకరానికి ఎన్ని సెంట్లు, సెంటుకి ఎన్ని అంకణాలు నేను ప్రశ్నిస్తారు కానీ అవసరమైన పనులు మాత్రం చేయరు.
పేపర్ ఒకటి తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ స్టార్ట్ చేయంగానే ఎక్కడెక్కడ వక్రీకరించగలం అని వెతుక్కునే తిక్కలోడు. ప్రజలు రేషన్ కార్డుల కోసం పడే ఇబ్బందులు చూడలేక మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి రిజిస్టర్ ఆఫీస్ లో రేషన్ కార్డు ఇప్పిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తే. మా పిచ్చోడికి కొన్ని రకాల ప్రభుత్వ హక్కులకు కొన్ని అవసరాలకు మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికెట్ తీసుకుంటారని..అది రిజిస్టర్ ఆఫీస్ లో ఇస్తారని తెలిసినట్లు లేదు. రేషన్ కార్డులు మ్యారేజ్ అయిన తక్షణమే ఇప్పిస్తానన్న మాట ఎక్కినట్టు లేదు ఈడికి. ప్రతి పాయింట్ రాసుకుని చదువుకున్న పిచ్చోడు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధికి రుణాలు కలిపిస్తానన్నారు దాని గురించి ఏం మాట్లాడుతారో తెలపాలి.. ఒక చెప్పుకు మరో చెప్పు చూపించి డబల్ గా ఏడుస్తున్న పేర్ని నాని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఇచ్చిన 30 కోట్లకు డబల్ 60 కోట్లు నీవు గాని నీ ప్రభుత్వం గానీ ఇవ్వగలరేమో ఆలోచించుకోవాలి. అదే శ్రద్ధ తో చక్కగా మీ మేనిఫెస్టో పక్కన పెట్టుకొని ఏమేమి చేయలేకపోయాం చూసుకుంటే మంచిది… మద్యపానం పూర్తిగా నిషేధం కరెంటు చార్జీలు అసలు తగ్గించటం, సిపిఎస్ రాగానే రద్దు చేస్తాం లాంటి హామీలు ఎన్నో ఉన్నాయిహరాజధాని లేకుండా పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి అని కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా వాగుతూ కాపులను మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు కాపులు…వారొక్కరు ఓటేస్తే ఆయన సీఎం అవరు అనేది ఈ పిచ్చోడికి తెలియకపోవచ్చు. గత ప్రభుత్వాలు ఎంతో కొంత ఐదు పర్సెంట్ ఇస్తామని చెప్పిన కాపు రిజర్వేషన్ అస్సలు వీలు కాదని కరాఖండిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డిని కాపులు ఎందుకు నమ్మాలో తెలపాలి. కనీసం బిడ్డల చదువుకు ఇస్తానన్న రుణాలు కూడా వారికి అందట్లేదు.. ఈసారి కూడా కాపులు బలి పశువులు కావాలి అని మీరు ఆలోచిస్తున్నట్లు జరగదు. వారికి ఏం కావాలో వారికి తెలుసు చక్కటి ఆలోచనతో కాపులందరూ కూడా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు. మీ ప్రభుత్వాలు కి మరొక సంవత్సరం మాత్రమే సమయం ఉంది.. ఏమేమి మంచి పనులు చేసి నిరూపించుకుంటారో చూసుకోండి… ఇప్పటికే ఆకాశమంత విమర్శలను, వ్యతిరేకతను మూటకట్టుకున్నారు మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వానికి ఇవే చివరి రోజులు రాసి పెట్టుకోండి అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు జనవాణి ప్రోగ్రాం లో ప్రజలు అనేక రకమైన సమస్యలు ఆయన ముందుకు వచ్చి వాటిని తీర్చగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారేఅని నమ్ముతున్నారు. అదే సమస్యలు మీ జగనన్నకి చెబుతాం కార్యక్రమం కు వస్తున్నాయా వస్తే ప్రభుత్వంలో ఉన్న మీరేం సమాధానం చెబుతున్నారు కూడా తెలియజేయాలి అని తెలిపారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న విశేష ఆదరణ తట్టుకోలేక ఏడుపులు ఏడుస్తున్న పిచ్చి వ్యక్తులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, శ్రీనివాస రెడ్డి, అల్తాఫ్, పవన్, వర్షన్, సాయి, షారూ, కాసిఫ్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.