రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

                కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం తహశీల్దార్ కి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలతో రైతులు పంట నష్టపోవడం చాలా బాధాకరమని పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటిపాలైందని అన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని పరిహారం అందించడంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మురళీకృష్ణ ఆరోపించారు. గత ఏడాది చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికి చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్ళిపోతుందని అదేవిధంగా ప్రత్తి పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలతో నల్లబారిపోయి పాడైపోయిందని తక్షణమే పరిహారం అందజేస్తే రైతులు తదుపరి పంటకు సిద్దమవుతారన్నారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని జనసేన పార్టీ తరపున మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు తునికిపాటి శివ, బత్తుల గోపయ్య, గోపి చారి మండల జనసైనికులు గుంజి యస్వంత్, నవీన్, గోపి, రాము తదితరులు పాల్గొన్నారు.

See also  మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే జనసేన అధికారంలోకి రావాలి : నలిశెట్టి శ్రీధర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి