నరవ గ్రామంలోని సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించిన వబ్బిన శ్రీకాంత్

నరవ

               పెందుర్తి ( జనస్వరం ) :  88 వార్డ్, నరవ గ్రామంలో గల సమస్యలను జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్, బొడ్డు నాయుడు, రాడి పెంటరావు సంబంధిత జీవీఎంసీ అధికారులు RO, AE గారు కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సమస్యలను జీవీఎంసీ అధికారులు దృష్టికి చాలాసార్లు తీసుకుని వచ్చామని ఫలితం మాత్రం శూన్యమని అన్నారు. దయచేసి వెంటనే సమస్యలపై (వీధిలైట్లు, మౌలిక వసతులు, మూడు స్మశానవాటికలో హై మస్ట్ లైట్లు ఏర్పాటు) చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ ద్వారా వినత పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు వివరణ ఇస్తూ తప్పకుండా మీ సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని బదులు ఇవ్వడం జరిగింది.

See also  అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి - గాదె వెంకటేశ్వరరావు