జనసేన అధికారంలోకి వస్తే వైయస్సార్ సమాధిలోని అవినీతి సొమ్మును బహిర్గతం చేస్తాం

జనసేన

        తిరుపతి ( జనస్వరం ) : ఎన్నికలు దగ్గర పడే కొద్ది పాలక వైసిపి లో భయం పుట్టి సీఎం జగన్ భయపడుతున్నాడని తమ జనసేనాని భయపెడుతున్నాడని జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, ముక్కు సత్యవంతుడులు వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు జనసేన నాయకులు రాజా మోహన్, సుమన్ బాబు, మునస్వామి, మనోజ్, కిషోర్, షరీఫ్, సాయి దేవ్, వినోద్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ప్రధానమైన టీవీ5, ఏబీఎన్.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ ల గొంతు నొక్కడం సమంజసం కాదని, అలాగే ప్రధాన ప్రతిపక్ష నేతల ను టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. పిల్లికి బిక్షం పెట్టని సీఎం జగన్ పాలనలో తమ జనసేనాని రైతులకు ఆయన కష్టార్జితాన్ని పంచుతున్నారని కొనియాడారు.. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను గడపగడపకు అతికిస్తుంటే జనం అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సజ్జల స్క్రిప్టును మంత్రులతో సహా సీఎం కూడా ఫాలో అవుతున్నారన్నారని, నేడు వైసిపి ఓటమి ఖాయమని, అర్థమైందని తెలుసుకుని జగన్ అండ్ కో ప్రెస్టేజ్ లో ఉన్నారన్నారు. తాము అధికారంలో రాగానే ఇడుపులపాయలోని వైయస్సార్ సమాధి ప్రాంగణంలో జగన్ దాచిన అవినీతి సొమ్మును బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. తిరుపతిలో గగమ్మ జాతరను భూమన జాతరగా మార్చుకున్నారన్నారు. వచ్చే మా పాలనలో స్వచ్ఛమైన వసూళ్ళు చేయని, భక్తులు ఇష్టపడి భయపడకుండా, స్వచ్ఛందంగా జరుపుకునే జాతరను జరుపుతామన్నారు, ప్రజలు కోరుకునే స్వచ్ఛమైన పాలన తమ జనసేన అందించనున్నదని కొనియాడారు.

See also  ఆధునీకరణ పేరుతో మూత పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారం మూత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి