విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం

విశాఖ

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్, డాక్టర్ శ్రీ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 44వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 32 వ వార్డులో పలు ప్రాంతాలు 32 వార్డ్ అధ్యక్షులు తెలుగు అర్జున్ తెలుగు లక్ష్మి ఇతర జనసైనికులు వీర మహిళలు పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని స్పష్టం చేసారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేనపార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు. 

See also  ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత అమృతరావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి