విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo 26 వ రోజు కార్యక్రమం 46వ డివిజన్ అధ్యక్షులు sk.షర్మిల అమీర్ భాష ఆధ్వర్యంలో కలరా హాస్పిటల్ వద్దనుండి ప్రారంభించి 46డివిజన్ లోని కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది.
పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 46 డివిజన్ లోని కలరా హాస్పిటల్ వద్ద నుంచి కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని ఎందుకు ఓటేసామని వైసీపీ ప్రభుత్వానికి ఓటేసి మా జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకున్నామని రాబోయే రోజుల్లో మేము ఇటువంటి పొరపాట్లు చేయమని వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగిందని పర్యటించిన ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారని వారందరూ మాకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం లో ముస్లిం మైనార్టీలను దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవానికి కూడా ఆయన కృషి చేయలేదని, అనేక సందర్భాల్లో ధర్నాలు , దీక్షలు చేసాం ముఖ్యమంత్రి పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి మూసాఫిర్ ఖానాను కేవలం 5000 రూపాయలకే పేద ముస్లింకి అందించాలని మేము డిమాండ్ చేస్తే వైసిపి ముస్లిం నాయకులు గాని,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గాని ఇంతవరకు సానుకూలమైన నిర్ణయం తీసుకురాలేకపోయారంటే పేద ముస్లింలకు ద్రోహం చేసినట్టే కదా అని? అస్లాం కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే అది మర్డర్ అని అనేక సందర్భాల్లో పోరాటం చేసి రెండుసార్లు పోలీసు విచారణకు కూడా ఎదుర్కోవడం జరిగిందని చివరికి అది మర్డర్ అని తేలిందని, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి డబ్బులు ఇస్తే నోరు మూత పడిపోతుందని, అన్యాయాలకు అక్రమాలకు అవినీతికి మద్దతు ఇచ్చే వ్యక్తి అని గాలిబ్ షాహి దర్గా భూములు కబ్జా చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఆయన మిత్రుల చెరలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవన్నీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని హాజ్ హౌస్ పశ్చిమ నియోజకవర్గం నుండి గన్నవరం తరలి వెళ్ళిపోతే వెల్లంపల్లి మౌనంగా ఉన్నారంటే అసమర్థుడు కాక ఇంకేమంటారని, దుకాణ్ మకాన్ పథకం కింద ఒక్కరి కూడా లోన్ ఇప్పించలేకపోయారని, పెళ్లి కానుక కింద ఒక్క ముస్లిం మైనార్టీలను కూడా ఎంపిక చేయలేదని వీటి గురించి ఎవరు నోరుమెదపరని మేము బలంగా పోరాటం చేస్తే మాత్రం మా మీద విమర్శలు చేయడానికి ముందు ఉంటారని, పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో సున్నా అని అవినీతి మాత్రం 100% జరిగిందని అడుగు అడుగున ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గాని అతని మిత్రులు గానీ వైసీపీ నాయకులు గాని అడ్డగోలుగా దోచుకున్నారని ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో నేను బహిర్గతం చేశాను అవన్నీ కూడా వాస్తవం అని తెలాయి అని అదేవిధంగా ఈ సందర్భంగా మేయర్ గారికి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ డివిజన్లో సమస్యల గురించి మీ మీద మీకే స్పందనలో ఫిర్యాదు అందజేస్తామని ముఖ్యంగా మేయర్ గారు మీ డివిజన్లో రోడ్లు, మెట్ల మార్గాలు, రిటైనింగ్ వాల్సు నిర్మాణం ఎలాగో చేయడం లేదు కనీసం పెద్ద మస్తాన్ వీధిలోని నేల బోరు, కరెంటు స్తంభాన్ని అయిన బాగు చేయండి మేయర్ గారిని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది ప్రజల తరఫున మా విన్నపం స్పందిస్తారని ఆశిస్తున్నాం లేదంటే స్పందనలో మీ డివిజన్లో సమస్యలపై మీకే మా డివిజన్ అధ్యక్షురాలు షర్మిల గారు మీకు ఫిర్యాదు చేస్తారని అన్నారు.
డివిజన్ అధ్యక్షురాలు షర్మిల అమీర్ భాష మాట్లాడుతూ ఈరోజు 46వ డివిజన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్తుంటే కొండ ప్రాంతంలోనే ప్రజలు మెట్లు సరిగా లేవని త్రాగునీరు సరిగా రావడం లేదని, రిటైనింగ్ వాల్ లేక కొండపై నుంచి రాళ్లు ద ఇళ్లల మీద పడుతున్నాయని ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలు మెట్లు సరిగా లేక ఎక్కలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి మేయర్ గారు మా సమస్యలను పట్టించుకోవడంలేదని అదేవిధంగా మేయర్ గారి డివిజన్లోని సమస్యలు పరిష్కారం చేయాలని స్పందనలో మేయర్ గారి కే ఫిర్యాదు చేయబోతున్నామని. వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మోసపోయామని ఈసారి మోసపోమని మేము ఖచ్చితంగా డివిజన్లోని అన్ని సమస్యల మీద పరిష్కరించడానికి కృషి చేస్తామని పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పోతిన మహేష్ గారే అని ముఖ్యంగా రంజాన్ మాసంలో పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వటం గాని అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పోతిన మహేష్ గారేనని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శిరం శీను బాబు, బాదర్ల శివ, బుద్ధన ప్రసాద్, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు,b.మోహనరావు కరీముల్లా, బెవర లోకేష్, వడ్డాది రాజేష్ , డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు సాయి శరత్, సిగానంశెట్టి రాము , ఆకుల రవిశంకర్, నల్లబిల్లి కానకారావు, జగడం శ్రీనివాస్, సబిన్కర్ నరేష్, , తొత్తడి భరత్, రజిని,పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు