విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 18 వ రోజు 35వ డివిజన్ అధ్యక్షులు NS ప్రదీప్ రాజ్ గారి ఆధ్వర్యంలో పూర్ణానంద పేట, గుర్రాల వారి వీధి నుండి ప్రారంభించి 35వ డివిజన్ లో పలు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. విద్యానికేతన్ రోడ్లో గల సాయిబాబా మందిరం కమిటీ ఆహ్వానం మేరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కమిటీ వారు మహేష్ గారికి ప్రత్యేక ఆశీర్వచనం సత్కారం చేసినారు. మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ గారు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 35 డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని ఈకార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా చేసినటువంటి పోరాటాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందని ,ఇసుక పాలసీ స్టీల్ ప్లాంట్ ,అమరావతి ఉద్యమం, కౌలు రైతులు, గోతులు పడ్డ రోడ్ల, యువతకి సంబంధించిన జాబ్ కేలండర్ ప్రతి అంశం మీద స్పందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని అటువంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే ఈ రాష్ట్రంకు మంచి జరుగుతుందని, సంక్షేమం అభివృద్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి దక్కుతాయని, రాష్ట్ర అభివృద్ధి ఒక నిజాయితీపరుడైన నాయకుడు చేతికి వెళ్తే ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు వస్తాయని, సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి హామీ పత్రాలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని డబ్బులు కట్టమంటున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మాకు ఇంటి పట్టా ఇస్తానని ఆశ చూపి హామీ పత్రాలు కూడా ఇచ్చి ఈ రోజున వాలంటీర్ల ద్వారా లక్షల రుపాయలు డబ్బులు కట్టమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని, ప్రతిరోజు కూలి పని పనిచేసి బ్రతికే మాకు లక్షలు కట్టమంటే మేము ఏ విధంగా కట్టగలమని, మహిళలు ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంచుతామని, స్థానిక కార్పొరేటర్ ఎన్నికల సమయంలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కార్పొరేటర్ స్థానికుడు కాకపోయినా అతనికి అవకాశం కల్పించామని కానీ ఇప్పుడు అతని అడ్రస్ ఎక్కడో మాకు తెలియడం లేదని స్థానిక కార్పొరేటర్ కనిపించి రెండేళ్లు అయిందని మా సమస్యలు పట్టించుకునే నాధుడే లేడని స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అందుకనే వైసీపీ నాయకుల కల్ల బొల్లి మాటలు నమ్మితే ప్రజలు ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చేసినటువంటి ద్రోహాన్ని అందరూ కూడా గ్రహించాలని, దళితులకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేశారని విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగిందని అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు వీరు కట్టాల్సిన అవసరం లేదని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవి కూడా చెల్లించాల్సిన పరిస్థితి అని సుమారు 26, 27 ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ దళిత ద్రోహ ప్రభుత్వంనకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సుమన్ నాయక్, నవీన్ రాజ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, ,కొరగంజి వెంకటరమణ, మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు సాయి శరత్, బోట్ట సాయికుమార్, పిలిచేరి రమేష్, జయాలక్ష్మీ,షాహీన, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.