
పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేవలో జనసేన కార్యక్రమం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపులో భాగంగా పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి సూచన మేరకు పిఠాపురం మండలంలో వరద ఉధృతి కారణంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పారు. జనసైనికులు కార్యకర్తలు అందరూ కలసి.. రాపర్తి, పి రాయవరం, తిమ్మాపురం, ముంపు గ్రామాలలో పర్యటించి వారు పడే ఇబ్బందులు తెలుసుకుని వారికి బిర్యాని ప్యాకెట్స్ అంద జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండలం జనసేన పార్టీ ZPTC అభ్యర్థి శ్రీ ఊట నానిబాబు (ఆదివిష్ణు) మరియు దువ్వా వీరబాబు, దేశినీడి సత్తిబాబు, దేశినీడి నాగ సత్యనారాయణ, వెంకటేష్ , జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.









