జనసేనాని పిలుపుతో వరద ముంపుకి గురైన కుటుంబాలకి ఆహార పొట్లాలు పంపిణీ చేసిన పోతురెడ్డి అనిత

జనసేనాని పిలుపుతో వరద ముంపుకి గురైన కుటుంబాలకి ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వీర మహిళ పోతురెడ్డి అనిత

          వరదలు వచ్చి ఇల్లు నీట మునిగి, తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న కృష్ణ లంక, రణదీవినగర్, 21 వ డివిజన్ వాసులకు నేనున్నాను అంటూ జనసేన డివిజన్ కార్పొరేటర్అభ్యర్థి పోతురెడ్డి అనిత గారు సుమారు  400 ఫుడ్ ప్యాకెట్( వెజిటేబుల్ బిర్యాని) పంచారు. పోతురెడ్డి అనిత గారు మాట్లాడుతూ జనసేనాని ఇచ్చిన పిలుపుతో వరద ముంపులకు గురి అయిన కుటుంబాలకు తూర్పు విజయవాడలో  సహాయం చేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పునరావసా కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన కృష్ణా గుంటూరు సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు  శ్రీ అమ్మిశెట్టి వాసు గారు, రావి సౌజన్య గారు, మాకినీడు నీరజ గారు, తోట మోహన్ కృష్ణ గారు, యన్నమనేని కృష్ణ గారు, సలాది భాను కుమార్ వంగవీటి ఏసు, ఎడవల్లి సతీష్, విన్నకోట సురేంద్ర, పోతిరెడ్డి మౌనిష నాయుడు, మహంతి సతీష్ జీవి, ఆర్ జగదీష్, సలాది వంశీ ప్రసాద్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 

 

See also  ఇసుక మాఫియాపై జనసేన నాయకుల నివేదిక తయారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి