అవనిగడ్డ, చల్లపల్లిలో జనసైనికుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

అవనిగడ్డలో జనసైనికుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

                       శ్రీ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ గారు.. ప్రాతఃకాల స్మరణీయుడు. గొప్ప మార్గదర్శి. ఏ కోణంలో చూసినా ఈ తరంలో ఆయన ఒక అధ్బుతం.. ఆయన జీవితం అసాంతం మనకు ఒక పాఠమే.. దేశం కోసమే పుట్టి దేశం కోసమే జీవించిన ధీరోదాత్తుడు.. రాకేట్ శాస్త్రాన్ని అవపోసనపట్టి దేశ ఆయుధ తూణీరానికి ఎన్నో క్షిపణులను, అణ్వాయుధాలను అందించిన దేశ భక్తుడు..శత్రువు మన దేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా దేశ రక్షణ వ్యవస్థ కు రూపకల్పన చేసిన దార్శనికుడు.. ఒక సాధారణ కుటుంబం లో జన్మించి ఒక్క శ్రీ కలాం గారికి తప్ప! మిస్సైల్ మాన్ అని కీర్తించిన భారతరత్నతో  గౌరవించిన వినమ్రునిగానే భాసిల్లారు.. వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఎందరో మహానుభావులు కృతిని అత్యంత ఇష్టపడే శ్రీ కలాం గారు భారతీయుల గుండెల్లో మహానుభావుడు గా మిగిలిపోయారు.  ఈరోజు ఆ మహానుభావుని జయంతి అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో  జనసేన తరుపున ఆయన ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మడమల రంజిత్ కుమార్, సోమరౌతు తాతారావు, సూదాని నందగోపాల్, సోమరౌతు నాంచారయ్య, సోమరౌతు చిన్మయ్ పాల్గొన్నారు. 

See also  పల్లెదారులు గ్రామీణుల పాట్లు పడుతున్నారన్న చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి