కొండవాలు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా జనసేన రెయ్యి రత్న

కొండవాలు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా జనసేన రెయ్యి రత్న

                          నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సత్తెమ్మతల్లి గుడి దగ్గర మరియు భానోజీ కాలనీలో కొండపైన ఇళ్ళల్లోకి కొండ చరియలు విరిగిపడి ఇళ్ళల్లోకి రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన – బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి రెయ్యి రత్న గారు ఈరోజు ఉదయం 8:00 గం.లకు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న వ్యక్తులకు ధైర్యం చెప్పి, gvmc కమీషనర్ గారికి శ్వేత పత్రం ద్వారా లెటర్ పెట్టి జరిగిన ఘటనకు గాను తగిన నష్టపరిహారాన్ని వచ్చే దిశగా మాట్లాడుతానని ఆ ఇంటి సభ్యులకు చెప్పడం జరిగింది. అనంతరం రెయ్యి రత్న మాట్లాడుతూ ఈ కొండపైన ఇళ్ళల్లో నివాసముంటున్న ప్రజలు ఈ వర్షాలకు కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత ఉన్న ప్రభుత్వ నాయకులు గానీ, గాజువాక నియోజకవర్గ అసెంబ్లీ శాసన సభ్యులు గానీ కనీసం ఘటనా స్థలానికి రాకపోగా, చూసి చూడనట్టు ఉండటం బాధా కరమైన విషయమని ప్రజలు వాపోతున్నారని అన్నారు. ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ అమాయక ప్రజలను పట్టించుకోక పోయినా మా జనసేన పార్టీకి సంబంధించి మేము వారికి అండగా ఉండి వారికి తగిన న్యాయం చేకూరేలా చేస్తామని మాట్లాడటం జరిగింది. ఈ ఘటనా స్థలంలో జనసేన నాయకులు మజ్జి వాసు, పెతకంశెట్టి సన్యాసి నాయుడు, సాడే రామారావు, జై కుమార్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  రాజోలులోని వివేకానంద మనో వికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి