పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం మండలం, మల్లం గ్రామం నుంచి రూరల్ మండలం కమిటీ సంయుక్త కార్యదర్శి బుర్రా విజయ్, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకర్ రావు, ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి సమక్షంలో చేరారు. జనసేన పార్టీలో చేరిన 40 మంది పెద్దలు యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అభివృద్ధి కోసం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా యువకులకు పెద్దలకు జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి గారు పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు స్థాపించారని అన్నారు. పేద ప్రజల తరఫున పోరాటానికి జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి మనమందరం తోడుగా ఉండాలని ఉద్దేశంతో యువకులందరూ జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని 10వ ఆవిర్భవ సభ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కౌలు రైతులకు, యాక్సిడెంట్లో మరణించిన కార్యకర్తకు ఇచ్చే భరోసా కు నచ్చి సుమారుగా 40 మంది జాయిన్ అవ్వటం జరిగిందని తెలియజేశారు. పిఠాపురంలో జనసేన పార్టీ బలపడుతుందని అన్నది ఇదే నిదర్శనమని అందరూ ఏకతాటిపై నడిచి జనసేన పార్టీ బలోపేతానికై ప్రతి ఒక్కరు కృషిచేసి పిఠాపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే దిశగా పని చేయాలని తెలియజేశారు. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, బుర్రా సూర్య ప్రకాశరావు, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకరావు,బుర్రా విజయ్, మల్లిరెడ్డి ఏసు మాణిక్యం,తిర్రంశెట్టి విష్ణు,నక్కా సుబ్బారావు, బుచ్చిరాజు, బుర్రా గణేష్, మల్లిరెడ్డి ఆది, మల్లిరెడ్డి గణేష్, కొతం శివ , రాసంశెట్టి నవీన్, గుండిబిల్లి భూపతి, వీరబాబు, దొనే సూర్య, అంజి, భద్రరావు, సిద్ది నాని,సత్తిబాబు, అమోస్, ఉమ్మిడి హరి, కాళ్ల రాజు, దేశిరెడ్డి సతీష్, కంద సోమరాజు కసిరెడ్డి నాగేశ్వరరావు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.