రాజధానిని మూడు ముక్కలు చేయటం దుర్మార్గం.. జనసేన పార్టీ నాయకులు

రాజధానిని మూడు ముక్కలు చేయటం దుర్మార్గం.. జనసేన పార్టీ నాయకులు

                    రాజధాని కోసం 300 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి సంకీభవంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గల జనసేన కార్యాలయం ఎదుట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మరియు బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష చేపట్టి అనంతరం బస్టాండ్ సెంటర్ నందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతతూ ఆరోజు ప్రతిపక్ష నేతగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఈరోజున రాజధానిని నిర్మించలేక, దోచుకున్న భూములకు రేట్లు పెంచుకోటానికి రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు అని వారు తెలిపారు. ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజలకు మాటలు చెప్పి 151 సీట్ల అధికారాన్ని చేపట్టి ఈరోజున ఒక తుగ్లక్ నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రజలని మభ్య పెడుతున్నారు. మరి ఆరోజున అమరావతి కోసం సుమారుగా 34 వేల ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నమ్మి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది అని, ఆరోజున ఆయన ఒక పూర్తి స్థాయి రాజధానిని నిర్మించకుండా అదే విధంగా మరి అటు రైతులకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ ఇదే మన రాజధాని అని పూర్తి స్థాయి భరోసా అనేది కల్పిచకుండా, ఈరోజున ఆయన ఓడిపోయి ప్రతిపక్ష హోదాలో ఉండి అమరావతి రైతుల కోసం అండగా నిలవకుండా ఈయన ఈయన కుమారుడు కరోన ని అడ్డంపెట్టుకుని వెళ్లి హైద్రాబాద్ లో కూర్చున్నారు అని వారు మండిపడ్డారు. మరి అద్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు అమరావతి ప్రాంత రైతుల సాక్షిగా మాట ఇచ్చారో ఆ మాటకి ఆయన జనసేన పార్టీ కట్టుబడి ఉంది, ఉంటది అని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటది అని, అది కేవలం ఒక్క జనసేన పార్టీ వలన పవన్ కళ్యాణ్ గారి వలన మాత్రమే సాధ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు నాయకులు తునికపటి శివ, నవీన్, చారి, త్రిశాంత్, నాగ, మహేష్ తదితరులు పాల్గొన్నారు

ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. ఇదే జగ్గయ్యపేట జనసేన పార్టీ డిమాండ్, నినాదం..

See also  బడ్జెట్ కేటాయింపులపై లోతైన చర్చ జరగాలి - జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి