ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

         రాజుపాలెం ( జనస్వరం ) : అనుపాలెం గ్రామంలో గత ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయిన వీర్ల విష్ణు సాయిని పరామర్శించి తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన బొర్ర వెంకట అప్పారావు. ఎవరికి కష్టం వచ్చినా జనసేనపార్టీ ముందు ఉంటుందని, జనసేనపార్టీ అన్నీ విధాలుగా సహాయ పడుతుందని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టారని అలాంటి నాయకుడికి మేమందరం కార్యకర్తలు అవడం చాలా గర్వంగా ఉందని తెలియజేసినారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేనిది మన జనసేన పార్టీ ప్రతి కార్యకర్త బాగుండాలని ఆలోచనతో కేవలం 500 రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా జనసేన పార్టీ ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

 

See also  ప్రజల కోసమే జనసేన కార్యక్రమం