మదనపల్లి, (జనస్వరం) : జనసేనపార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా జన సైనికులను మై ఫోర్స్ మహేష్ కోరారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాలు ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆపద సమయంలో ఆపన్న హస్త అందించే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం రూపొందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ వెల్లడించారు. మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సానుభూతిపరులున్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జనసైనికులుగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని జనసేన పార్టీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించి జనసేన పార్టీ సభ్యులుగా చేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డాక్టర్ మై ఫోర్స్ మహేష్ తెలియజేశారు. అందరూ కష్టపడి రాష్ట్రంలోనే మదనపల్లి నియోజకవర్గం నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలపాలసిందిగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జండా ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందిగా, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుదలచిన వారు మీ ఫోటో ఆధార్ కార్డు ఫోటో నామిని ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబర్ తో పాటు 500 రూపాయలు ఫోన్ పే గూగుల్ పే పేటీఎం ద్వారా చేసి మా జనసేన పార్టీ వాలంటరీ దగ్గర నుంచి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన నాయకులు సందీప్, ప్రవీణ్, గంగాధర్, అయ్యాజ్, ధరణి, నరేష్, నాగేంద్ర, హర్ష తేజ, మహిళా నాయకురాలు మల్లికా, శోభ, రూప తదితరులు పాల్గొన్నారు.