పేద కుటుంబానికి అండగా జనసేన

పేద కుటుంబానికి అండగా జనసేన

     టెక్కలి మండలంలోని గూడెం గ్రామం జనసైనికుడుకి పార్టీ శ్రేణులు అండగా నిలిచాయి. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త అయినటువంటి కోరలాన చిన్నారావు తండ్రి వరధారావు గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు శనివారం చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఒక బస్తా బియ్యం తోపాటు కొంత ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. అలాగే చిన్నారావుకు ఎల్లప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, తోట శ్యామ్, బొడ్డేపల్లి వెంకటేష్, లండ అశోక్, హనుమంతు దిలిప్ పాల్గొన్నారు.

See also  4 వేల మంది టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటాం - జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి