వృద్దులకు అందని, తొలగించిన పింఛన్లు : జనసేనపార్టీ నాయకులు గానిగ బాషా

వృద్దులకు అందని, తొలగించిన పింఛన్లు : జనసేనపార్టీ నాయకులు గానిగ బాషా

               కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో వృద్దులకు ఇస్తున్న వృధ్యాప్య పింఛన్లను ప్రభుత్వం కొన్ని అనర్హులుగా ప్రకటించి తొలగించారని ఇంతవరకు ఎటువంటి విచారణలు చెయ్యకుండా పింఛన్ అందక పోవడంతో అర్హులైన వృద్దులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా తెలిపారు. ఈ సందర్బంగా గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లతరబడి పింఛన్ పొందుతున్న వృద్దులకు కొందరికి రేషన్ కార్డ్,లేదని కొందరికి ఆధార్ కార్డ్ లో వయస్సు 60సం. కంటే తక్కువ వుందనే కారణంచేత పండు ముసలి వారిని పింఛన్ అందించకపోవడం దారుణమని అన్నారు, నెల వారి పింఛన్ మీద ఆధారపడి జీవించే వృద్దులు దాదాపు 10 నెలల నుంచి కాళ్ళు అరిగేలా సచివాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదన్నారు. కూలి పనులు చెయ్యలేక వేరే దారి కనపడక నరకయాతన అనుభవిస్తు కార్యాలయాలకు తిరుగుతుంటే వారికి అధికారులు డి ఆర్ డి ఏ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలకు పింఛన్ ఏరివేత సర్వే చేపట్టారని కానీ అందుకు అనుగుణంగా లేకపోయినా చాలా మంది పింఛన్ కోల్పోయారని గోనెగండ్లలో తొలగించిన 470 పింఛన్లను విచారించి అర్హులైన వృద్దులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. అదేవిధంగానే ప్రభుత్వం ఇచ్చిన హామిలో భాగంగా ప్రతి సంవత్సరం అవ్వ తాతలకు రూ.250 పింఛన్ పెంపులో ఇంకా పెంచకుండా ఇస్తున్నారని పింఛన్ పెంచి నాలుగు నెలలు కలిపి ఇవ్వాలన్నారు. 

See also  అధికార పార్టీ నేతలు అక్రమంగా..బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి