
మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దీపిక కడారి మీద పోలీసు ఫిర్యాదు చేసిన జనసైనికులు
దీపిక కడారి అనే మహిళ సోషల్ మీడియా ద్వారా నిన్న మెగా ఫ్యామిలీ మీద మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని సంప్రదించి రామచంద్రపురం నియోజకవర్గం జనసేనా నాయకులు, జనసైనికులుఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీపిక కడారి అనే మహిళ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మా రామచంద్రపురం నియోజకవర్గం జనసైనికులు చాలా బాధకు గురి అవడంతో ఆమె పై చట్టరీత్యా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు సంపత్ జనసేన గారు మరియు జనసేన నాయకులు బుంగా రాజు గారు రాంబాబు నాయుడు, చల్లా బుజ్జి,జడ్డుసతీష్ మరియు ఇతర జనసైనికులు పాల్గొనడం జరిగింది.









