యస్ కె యు భగత్ సింగ్ విద్యార్థి విభాగం అద్యక్షులు జయంత్ వర్ధన్ కు మహాత్మా గాంధీ సేవ పురస్కార్ అవార్డ్

యస్ కె యు భగత్ సింగ్ విద్యార్థి విభాగం అద్యక్షులు జయంత్ వర్ధన్ కు మహాత్మా గాంధీ సేవ పురస్కార్ అవార్డ్

           గత కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో అనేక కార్యక్రమాలను చేస్తున్న యస్ కె యు భగత్ సింగ్ విద్యార్థి విభాగం అధ్యక్షులు జయంత్ వర్ధన్ కు మహాత్మా గాంధీ పుట్టిన రోజున జీరో బడ్జెట్ పాలిటిక్స్ వారు మహాత్మా గాంధీ సేవ పురస్కార్ అవార్డ్-2020 లభించింది. ఈ అవార్డ్ ను తెలుగు రాష్ట్ర లలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిలో కొందరిని గుర్తించి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వారు అందచేశారు. భగత్ సింగ్ విద్యార్థి విభాగం అధ్యక్షులు జయంత్ వర్ధన్ గారు కోవిడ్ 19 సమయంలో ఇబ్బందిపడుతున్న 600 కుటుంబాలకు కూరగాయలు అందజేయడం, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసరాలు ఇవ్వడం, అన్నదాన కార్యక్రమం, తదితర కార్యక్రమాలకు విశేష సేవ కార్యక్రమాలకు మహాత్మా గాంధీ సేవ పురస్కార్ అవార్డ్ గాంధీ జయంతి రోజు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జయంత్ వర్ధన్ కు పలువురు జనసేన పార్టీ నాయకులు, భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు, మిత్రులు, ప్రత్యేకంగా అభినందించారు.

See also  కురసంగిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల