
జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 381వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1300 మొక్కలు మరియు 1300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 127695 మొక్కలు మరియు 29100 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరారు. నియోజకవర్గ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తగిన సూచనల గూర్చి వారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు.








