
నాగర్ కర్నూల్ లో మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల కు కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి మహిళా డిగ్రీ కళాశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా అన్యాక్రాంతమైన భూ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భూ కబ్జాదారులు పై చర్యలు తీసుకుంటామని కబ్జాదారులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి వారం రోజులలో సర్వే నిర్వహించి కళాశాలకు స్థలం కేటాయించాలని ఆదేశించి రోజులు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం వెనక అధికార పార్టీ హస్తం ఉందని సంకేతాలు అందుతున్నాయని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్లు కళాశాల పరిసర ప్రాంతాలలో లే అవుట్ చేసి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారని ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలవదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఆగడాలను కథనాలు గా వస్తున్న సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అక్కడకు వెళ్లి అవినీతిని సహించని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఇంతవరకు ఎంతమంది భూ కబ్జాదారులు పై చర్యలు తీసుకున్నారో ఎమ్మెల్యే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళాశాల కేటాయించిన ఐదు ఎకరాల 11 గుంటల భూమిని కాపాడేందుకు జనసేన సిద్ధంగా ఉందని అందుకు దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.శేఖర్, రాజేష్ గౌడ్, రాకేష్ రెడ్డి, పల్లె మహేష్, పి.ఆర్ రఘు, బారిగారి రాజేందర్, కురుమన్న, కోడిగంటి సాయి, సంతోష్, జస్టిన్ బాబా, సూర్య, శివ, రాజేష్, మహేష్, ఎడ్ల శివ, హరి పవర్, లక్ష్మణ్ నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.









