దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం : రాహుల్ సాగర్
హిందూ దేవుళ్ళ పై టిటిడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని గారు క్షమాపణ చెప్పాలి అని జనసేన నాయకుడు రాహుల్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసే దేవుళ్ళు పై మంత్రిగారు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని హిందువులు ఎంత ఆదరించే దైవం వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాంటి దేవుళ్ళ పై ఇష్టానుసారంగా మాట్లాడడం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఇప్పుడు మంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు