ధర్మవరం ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో జనసేనపార్టీలోకి చేరికలు

ధర్మవరం

          ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ లోకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 39 వ వార్డ్ రామ్ నగర్ కు చెందిన 10 కుటుంబాలు చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు దాసరి రామకృష్ణ, కుండ పరమేష్, పూజారి రాము, కొప్పల సురేష్,పడగిరి దేవా,కుండ బాలకృష్ణ మరియు మొదలగున వారు,ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లుమడుగు కాసిం వలి, పోతిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

See also  యువతను ప్రోత్సహిస్తున్న మాడుగుల జనసేన నాయకులు రాయిపురెడ్డి కృష్ణ