జగ్గయ్యపేట సమస్యలను నాదెండ్ల మనోహర్ గారికి వివరించిన జనసేన నాయకులు

జగ్గయ్యపేట

            జగ్గయ్యపేట ( జనస్వరం ) : ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పర్యటనలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన తరుపున జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ వారి మిత్ర బృదం కలిసి మనోహర్ గారికి ఘన స్వాగతం తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత వారం కిందట జగ్గయ్యపేట లో జరిగిన సంఘటన గురించి వారికి వివరించటం జరిగింది అని, ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దారుణమైన చర్య అని, ఇందులో వెనుక తిరిగేది ఉండదని, తప్పకుండా జగ్గయ్యపేట పర్యటన ఉంటుందని స్వయంగా అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారే వచ్చి మాట్లాడతారని తెలపటం జరిగిందని కిషోర్ కుమార్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు బొలియసెట్టి శ్రీకాంత్, వీరమహిళ విభాగం అధ్యక్షురాలు రావి సౌజన్య, జనసైనికులు త్రిశాంత్, అరవింద్, నరేష్, నాగేంద్ర, కేదార్, గోపి తదితరులు పాల్గొన్నారు.

See also  అత్తిలిలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం