నాయుడుపేట మున్సిపాలిటిలో పవనన్న ప్రజాబాట 24 వ రోజు

పవనన్న ప్రజాబాట

      సూళ్ళూరుపేట ( జనస్వరం ) : నాయుడుపేట మున్సిపాలిటీ లో 1వ వార్డ్ లో చంద్రబాబు నాయుడు కాలనీలో పూర్తి చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్  గారు జనసేన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మూడు వేల కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితంలో నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున సహాయమ చేస్తున్నారని అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారని.. అటువంటి వ్యక్తిని ఈసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఇక్కడి ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ‌ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి జనసేనపార్టీ సిద్దాంతాలు..ఆశయాలతో పాటు జనసేనపార్టీ అధికారంలోకి‌ వస్తే అమలు చేయనున్న మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. అధినేత పవన్ కళ్యాణ్ సుసంపన్నమైన పరిపాలన అందించే దిశగా పవనన్న షణ్ముఖ వ్యూహంతో ముందుకు‌ సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.  

See also  కొత్త జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి