సూళ్లూరుపేట నియోజకవర్గంలో 20వ రోజు పవనన్న ప్రజాబాట

    సూళ్లూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో చంద్ర బాబు నాయుడు నగర్ లో 20వ రోజు పవనన్న ప్రజాబాటను ఉయ్యాల ప్రవీణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు రెండు వేల గడపలకి వెళ్లి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని, షణ్ముఖ వ్యూహం ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేల పవన్ కళ్యాణ్ పరిపాలన ఉండబోతుందని ప్రజలకి కరపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్వానంగా ఉందని, దానివల్ల ప్రజలు తరచుగా రోగాల బారినపడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది ఆయన తెలిపారు. జనసేన పార్టీ అధికారం లోకి రాగానే పారిశుద్యం పైన దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచి ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని ఉయ్యాల ప్రవీణ్ తెలియచేసారు.

See also  జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి