Search
Close this search box.
Search
Close this search box.

చిరంజీవి 50 రోజుల ముందస్తు జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేట్ కిట్స్, ఫ్రూట్స్ పంపిణీ

బ్లడ్ డొనేట్

             కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గ జనసేన నాయకులు, చిరంజీవి యువత సభ్యులు మాట్లాడుతూ మనకి ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరొకరికి ప్రాణాలు పోసే అవకాశం కల్పించాడని అదే రక్తదానం అని అన్నారు. ఏ దానం చేయాలన్నా అది విద్యా, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. కానీ ఒక రక్తదానమే ఓ మంచి మనసుతో ముడిపడి ఉందన్నారు. పద్మభూషణ్ Dr. మెగాస్టార్ చిరంజీవి మాటలను స్ఫూర్తిగా తీసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేస్తూ సహాయ సహాకారంగా నిలుస్తున్నామన్నారు.  చిరంజీవి ముందస్తు 50రోజుల పుట్టిన రోజు వేడుకలలో భాగంగా  కదిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రక్తనిధికి ” స్ట్రెస్ బాల్స్, ఫ్రూటిలు, ప్లాస్టర్స్ ను రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో హాస్పిటల్ సూపరిడెంట్ హుస్సేన్ కు అందించడం జరిగింది. హుస్సేన్ సారు మాట్లాడుతూ సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తితో ఎంతో మంది అభిమానులు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ముందుకు వచ్చి రక్తనిధికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా చిరంజీవి ,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పుట్టిన రోజుల సందర్భంగా కూడా బ్లడ్ క్యాంప్లు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్, జిల్లా జనసేన కార్యక్రమముల కార్యదర్శి కూటాల లక్ష్మణ్, తదితర అభిమానులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way