అవుకు జనసేన నాయకులు ఆధ్వర్యంలో మన ఊరు – మన బడి కార్యక్రమం

     అవుకు, (జనస్వరం) : అవుకు మండలంలో ఈరోజు జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ ఆధ్వర్యంలో విద్య మా హక్కు – అందరూ చదవాలి అందరూ ఎదగాలి నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా మానేసిన కుటుంబాల దగ్గరకు వెళ్లి చదువుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేశారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద విద్యా ప్రాధాన్యత గురించి నినాదాలు చేశారు. అవుకు మండలంలోని విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిం2ఏహాద్రి, ఓబులేసు , మనోహర్, వంశీ, రమణ, రత్నాకర్, మాధవ్, మల్లికార్జున తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  వైసీపీ ప్రభుత్వంలో మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి