గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పలువురు జనసేనలో చేరిక

గెడ్డం బుజ్జి

      పాయకరావుపేట ( జనస్వరం ): పాయకరావుపేట మండలం పల్మనపేట పంచాయతీ కొర్లయ్యపేట గ్రామ వార్డ్ మెంబర్ సురాడ నల్లబాబు వైసిపి పార్టీ కార్యకర్తలు నగేష్, జగన్నాథం, శివ, అప్పలరాజుతో పాటు సుమారు 25 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత అనుసరిస్తున్న విధానాలు, చేపడుతోన్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది ఇది జనసేన పార్టీలోనికి చేస్తున్నారన్నారు. కొర్లయ్య గ్రామం నుంచి పార్టీ లో చేరిన కార్యకర్తలను అభినందించారు. వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని గెడ్డం బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు గడ్డం ఆకాష్, జగ్గన్న దొర, పల్లి దుర్గారావు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  SC & ST సబ్ ప్లాన్ నిధులతో మౌలిక వసతుల కల్పన చేపట్టాలని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారికి వినతి పత్రం సమర్పించిన జనసేన నాయకులు