
వికలాంగుడికి వీల్ చైర్ మంజూరు చేయండి : కణితి కిరణ్
టెక్కలి నియోజకవర్గ సంతబొమ్మలి మండలం కాపుగోదాయవలస గ్రామంలో తన పర్యటనలో భాగంగా తమాడ రామారావు అనే వికలాంగుడు ప్రమాద వశాత్తు తన ఏడమ కాలుని కోల్పోయానని తనకు వీల్ చైర్ ఇప్పించమని తన ఇబ్బందులను కణితి కిరణ్ దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించి సంతబొమ్మలి ఎంపీడీఓ ఆఫీస్ లో గత 2019 సాధారణ ఎన్నికల కోసం ప్రభుత్వం తెప్పించిన వీల్ ఛైర్స్ నిరుపయోగంగా ఉన్నాయని అందులో ఒక వీల్ చైర్ ను రామారావు కి మానవతా దృక్పథంతో ఇప్పించమని టెక్కలి జాయింట్ కలెక్టర్ సూరజ్ గారికి వినతి పత్రం ద్వారా కోరారు. తక్షణమే సంతబొమ్మలి ఎంపీడీఓ గారిని సంప్రదించి తగు సహాయం అందిస్తామని జాయింట్ కలెక్టర్ సూరజ్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి కణితి.కిరణ్ తో పాటు జనసేన నియోజకవర్గ నాయకులు నర్సిపురం శేఖర్, సాయి మహంతి పాల్గొన్నారు.








