సేవా కార్యక్రమాల్లో జనసైనికులు ముందుంటారు : 47వ డివిజన్‌ అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్‌

      విజయవాడ, (జనస్వరం) : స్థానిక 47వ డివిజన్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్‌ ఆధ్వర్యంలో బెవర కృష్ణ జ్ఞాపకార్థం ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహించాలంటే జనసైనికులు అందరి కంటే ముందుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ బాబు, ఉమా శంకర్‌, రాళ్లపూడి గోవింద్‌, అప్పారావు, బంటుమిల్లి రాంబాబు, దాసరి దాసు, పడాల రాంబాబు, యిల్లిపిల్లి నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

See also  గుమడ గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ