బొబ్బేపల్లి సురేష్ నాయుడుపై అక్రమ కేసు, అండగా నిలిచిన జనసేన లీగల్ టీమ్

జనసేన

       సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడుపై అక్రమ కేసు ఈనెల 9వ తేదీన నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు విషయమై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారి దృష్టికి వెళ్లడం జరిగింది. ఈ కేసు నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ ఒక చాలెంజ్ గా తీసుకొని చాకచక్యంగా తమదైన శైలిలో అనర్గళంగా తమ వాదనను వినిపించారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ కు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ కు  ధన్యవాదాలు తెలిపారు. 

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 24వ రోజు సేవా కార్యక్రమాలు