గుంతకల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీ నియామకం ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు TC.వరుణ్ సూచనల మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గుంతకల్ నియోజకవర్గం జనసేన కమిటీల ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్న కార్యకర్తలను గుర్తించి వారికి మండల కమిటీలలో స్థానం కల్పించడం జరిగింది. అలాగే కౌలు రైతుల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ, చంద్రశేఖర్, వాసగిరి మణికంఠ, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, జీవన్ కుమార్, అలాగే గుత్తి మండల అధ్యక్షులు వెంకటేశులు, గుంతకల్ మండల అధ్యక్షులు పురుషోత్తం, పామిడి మండల అధ్యక్షులు ధనుంజయ, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.