అనంతపురం, (జనస్వరం) : రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి పోయాయి. ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కోనసీమ ఘటనకు తెరలేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కొత్త బట్టలు, కొత్త కోట్లు కుట్టించుకొని దావోస్ కు వెళ్లి పెట్టుబడులు తెస్తామని ఎగేసుకొని వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? అక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం, సామర్థ్యం లేక కోనసీమ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందని జయరాం తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తుంది మీరు. ప్రభుత్వ సలహాదారుగా ఉండి ప్రజల ధనాన్ని జీతంగా తీసుకుంటూ YSRCP పార్టీ పక్షాన మాట్లాడటాన్ని చిల్లర రాజకీయం అంటారు? గతంలో మీరు అధికారం కోసం కోడి కత్తి? బాబాయ్ గుండెపోటు? లాంటి అంశాలను వాడుకొని అధికారంలోకి రావడాన్ని ఏమంటారు? దీన్ని చిల్లర రాజకీయం అంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల్ని, కుల మతాలగా విభజించి మళ్లీ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నది మీరు? వీటినే చిల్లర రాజకీయాలు అంటారు, YS జగన్మోహన్ రెడ్డి వీరి తండ్రి లాగానే కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం కోసం నాటకాలు ఆడుతున్నారు అని ప్రజలకు అర్థమైపోయింది? వీటినే చిల్లర రాజకీయాలు అంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎవరు స్క్రిప్ట్లు ఇచ్చేంత శక్తిసామర్థ్యాలు మేధస్సు ఏ ఇతర రాజకీయ పార్టీ నాయకులకు లేదు అని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ఎవరికి B-టీం కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జనసేన గురించి ఈ విధంగా చౌకబారు మాటలు మాట్లాడడాన్ని చిల్లర రాజకీయం అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైన రాజకీయం చేస్తున్నారు ప్రజలకు అర్థమైపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.