వర్జినీయా జనసైనికుల సహాకారంతో పాలకొల్లు క్వారంటైన్ లో 800 మందికి నాణ్యమైన ఆహారం అందజేత

వర్జినీయా జనసైనికుల సహాకారంతో పాలకొల్లు క్వారంటైన్ లో 800 మందికి నాణ్యమైన ఆహారం అందజేత

                 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 49 వ జన్మదినోత్సవ సందర్భంగా పాలకొల్లులో ఉన్న కోవిడ్ ఆసుపత్రిలో కరోనా 800 రోగులకు నాణ్యమైన ఆహారం, పండ్లు అందించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వర్జినీయా జనసైనికులు కూడా పాలు పంచుకున్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 600 ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేటర్ నళిని పోలిశెట్టి గారు  మాట్లాడుతూ గతంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఈసారి కోవిడ్ కారణంగా సామాజిక కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ చేశామని, అలాగే ఈ  కార్యక్రమానికి ఆర్థిక సహకారాన్ని అందించిన  వర్జినీయా జనసైనికురాలు మాధురి బల్ల గారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

See also  రైల్వేకోడూరులో నివర్ తుఫాన్ వల్ల లోతట్టు ప్రాంతలో ఇబ్బంది పడుతున్న వారిని జనసేనపార్టీ తరుపున పరామర్శించిన అంకిపల్లి అఖిల్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి