కళాశాలలు మరికొన్ని రోజులు మూసివేయాలి : జనసేన ఈమని కిషోర్

కళాశాలలు మరికొన్ని రోజులు మూసివేయాలి : జనసేన ఈమని కిషోర్

            జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పట్టణంలో గల స్థానిక ఎస్ బి ఐ బ్యాంక్ పైన గల జె ఆర్ సి విద్యాసంస్థల విశ్వభారతి డిగ్రీ కళాశాల యాజమాన్యం చివరి సంవత్సర విద్యార్థులని సోమవారం నుంచి కళాశాలకు రమ్మని చెప్తున్నారని, మరి పట్టణంలో ఉన్న కోవిడ్ కారణంగా మరి కొన్ని రోజులు కళాశాల మూసివేయాలని పలువురు విద్యార్థులు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ గారిని కలిసి విన్నవించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మాకు మీ నుంచి అయితేనే న్యాయం జరుగుతుందని అందుకే మిమ్మల్ని ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఇప్పుడిప్పుడే కోవిడ్ కొంచం తగ్గు ముఖం పడుతుంది అని, ఇలాంటి సమయంలో కళాశాలలు తెరిసి పిల్లల్ని రమ్మని ఇబ్బంది పెట్టే చర్యలు మంచిది కాదు అని, పిల్లల ప్రాణాలతో చెలాగాటాలు మంచిది కాదు అని, తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి  తీసుకోవాలని ఆయన తెలిపారు. కళాశాలలో ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులు ఒకే తరగతిలో ఎక్కువ సేపు ఉండటంతో అందులో ఎవరికి కోవిడ్  ఉందో తెలియని పరిస్థితులు కూడా ఉంటాయని, వారు అంటిచుకున్నది కాకుండా వారి తల్లి తండ్రులకి కూడా ఈ కోవిద్ సోకే అవకాశం ఉన్నందున మరి కళాశాల యాజమాన్యం ఒక్కసారి ఆలోచించాలని, అదే విధంగా జనసేన పార్టీ కూడా ప్రిన్సిపాల్ వారిని కలిసి తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హరీష్, రెహ్మాన్, నరేష్, గోపి, పవన్ సాయి, రాం పలువురు పాల్గొన్నారు.

See also  జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల భాగంగా రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 9 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ