జనసేనాని జన్మదిన సందర్భంగా కూలీ పనికి వెళ్తూ పోగు చేసుకున్న డబ్బులతో వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ చేసిన 60 ఏళ్ల సరస్వతి

జనసేనాని జన్మదిన సందర్భంగా కూలీ పనికి వెళ్తూ పోగు చేసుకున్న డబ్బులతో వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ చేసిన 60 ఏళ్ల సరస్వతి

                     పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో  తాను కూలీ పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీద అనాథ ఆశ్రమంలో చీరలు పంపిణీ చేసిన 60 ఏళ్ల సరస్వతి. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామంలోని సరస్వతి వృత్తిరీత్యా కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతోంది. సరస్వతి మాట్లాడుతూ నాకు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చాయని, పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు కూడా తెలుసుకున్నాను. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కరోనా సమయంలో జనసైనికులు చేసిన సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నేను కూడా ఏదైనా చేయాలని నేను రోజూ కూలి పనికి వెళ్తూ సంపాదించిన డబ్బులతో గొట్లూరులోని అనాధ ఆశ్రమంలో వున్న వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. నేను చేసే ఈ కార్యక్రమం గురించి ధర్మవరం జనసేన ఇంచార్జ్ మధుసూధన్ రెడ్డి గారు తెలుసుకొని ఆయన చేతుల మీద ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జనసేన ఇంచార్జ్ మధుసూధన్, అనాధ ఆశ్రమ నిర్వాహకులు, జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.   

 

See also  కౌసల్య అనే విద్యార్థినికి అండగా నిలిచిన జనసేన నాయకులు యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి