భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పెదనాగయ్యపాలెం పంచాయితీలో గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో బొడ్డు నర్సింగ్ కుటుంబం ఇల్లు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ కిరణ్ చిన నాగమయ్యపాలెం జనసైనికుడు బొడ్డురాజుకు తెలిపారు. ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలన్న సంకల్పంతో విద్యార్థి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తో కిరణ్ మాట్లాడి వారి ద్వారా ఈ పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరం అయిన అన్ని వస్తువులను ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయపడిన ఆ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. అదే విధంగా పంచాయితీలో పని చేసిన ప్రతీ యువకులకు మరియు జన సైనికులు కూడా కొంత వరకు సహాయపడటం జరిగింది. సహాయం అందించిన అందరికీ బొడ్డు నర్సింగ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.