★ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ….?
★ సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ..? నాసిరకం మద్యం ఎందుకు అమ్ముతున్నారు..?
★ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వమే ప్రోత్సహించడంలా ఉంటే పరిస్థితి, దశ దిశా లేని దిశా చట్టం ఏమయ్యింది.,?
★ కేంద్రం మెడలు వంచి, వాళ్ళ ముందు తొడలు కొట్టి సాధిస్తామన్న ప్రత్యేకహోదా ఎక్కడ…?
★ ఉపాధి లేక ఎంతోమంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన మీ ప్రభుత్వం పైపెచ్చు ఇసుక ధరలు ఎందుకు పెంచి౦దీ…?
★ పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ…? పోలవరం ప్రాజెక్టును ఏటీఎం కార్డ్ గా వాడుకున్న చంద్రబాబు చేసిన అవినీతి మీరు కొనసాగిస్తున్నారా…?
★ గత టీడీపీ ప్రభుత్వం గుంతల రోడ్ల మరమ్మత్తు చేయలేదనే వంకతో మీరూ మరమ్మతులు చేయరా కొత్త రోడ్లు వెయ్యారా మీ పరిస్థితి ఏంటి…?
★ కడప ఉక్కు కర్మాగారం గత టీడీపీ ప్రభుత్వంలో లేదు మీ ప్రభుత్వం లో కూడా లేనట్లేనా …?
★ ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతుంటే ఇంకా కొత్త పరిశ్రమలు మీ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం ఏదీ…?
★ జాబ్ క్యాలెండర్ ఎక్కడా…?
★ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మీ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ…?
★ CPS రద్దు ముద్దులు పెట్టి మరీ అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తామన్నారు. ఏమయ్యింది..?
★ కులకార్పొరేషన్ లోన్స్ ఎందుకు ఇవ్వటం లేదు…?
★ కరెంట్ కోతలు ఎందుకు…? కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు…?
★ ఆర్టీసీ (RTC) ఛార్జీలు ఎందుకు పెంచారు…?
★ నిత్య అవసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి…? ఎందుకు ధరలు అదుపు చేయలేక పోయారు..?
★ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలు ఎందుకు విపరీతంగా పెంచారు.?
★ పేదల కోసం పెట్టిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లు ఎందుకు మూసివేశారు..? కనీసం పేరు మార్చి వైయస్సార్ క్యాంటీన్ పేరుతో అయినా కొనసాగించవచ్చు కదా..?
★ గత టీడీపీ ప్రభుత్వం ఓటర్లకు ఎర వేయడం కోసం సార్వత్రిక ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ప్రవేశపెట్టిన దాన్ని మీరు కొనసాగించక ఎందుకు నిలిపివేశారు…?
★ పేదల కోసం ఇస్తామన్న పెళ్ళికానుక, దుల్హన్ పథకం ఎందుకు ఆపారు…?
★ NSFDC లోన్స్ ఎందుకు ఆపారు…?
★ వైఎస్సార్ భీమా ఎక్కడా..?
★ రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు..?
★ SC,ST మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు…?
★ తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా ఎందుకు చేయబోతున్నారు…?
★ అభయ హస్తం, ఆసరా డబ్బులు ఎక్కడా …?
★ టిడ్కో ఇళ్ళు 3 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు..? ఇంకెప్పుడిస్తావ్? అసలిస్తావా? ఇవ్వవా? నీవుద్దేశ్యం ఏంటి? ఎన్నికలకు ప్రచారం కోసం వాడుకుంటావా..?
★ ఎయిడెడ్ విద్యాసంస్థల పరిస్థితి ఏంటి…? చేతకానప్పుడు ఎందుకు టచ్ చేశావ్..?
★ రైల్వేజోన్, పులిచింతల, హంద్రీనీవా, పోలవరం, ఇవన్నీ నీవల్ల అవుతాయని ఇంకా జనాన్ని నమ్మిస్తావా..?
★ రైతు భరోసా ఎక్కడ…? రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేది ఉందా..? ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను అదుకుంటామన్న మాట ఏమైంది…?
వైసీపీ పార్టీ గడప గడపకూ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజల్లోకి తిరుగుతుండగా సామాన్యుల నుంచి పై ప్రశ్నలు నాయకులకు ఎదురవుతున్నాయి.