కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్…గోడపత్రికలను ఆవిష్కరించిన యు.పి.రాజు

     ఆమదాలవలస, (జనస్వరం) : “టీం పిడికిలి” సహకారంతో ప్రచురించిన గోడ పత్రికలను రేగిడి ఆమదాలవలస మండల నాయకులు రెడ్డి.బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3000 (మూడు వేల ) కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 30 కోట్లు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని, రైతులు సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించామని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల జడ్పీటీసీ అభ్యర్థి సైడాల.జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల.రమేష్, దుర్గారావు, ఈశ్వర్, పి.ఎ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గారి ఆధ్వర్యంలో 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :