పలుమార్లు సమస్యలని అధికారులకు విన్నవించినా పట్టించుకోని అధికారులు

పలుమార్లు సమస్యలని విన్నవించినా పట్టించుకోని అధికారులు. 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లంకమ్మ మాన్యం, రాజశేఖర్ పురం, సుగాలి కాలనీ, B.C కాలనీ, సీతాయలంక, సింహాద్రి కాలనీ, మండలిపురం కాలనీలలో, ప్రస్తుతం పడుతున్నవర్షాలకు నీరు బయటకు పోయే మార్గం లేక నివాసం ఉండే ఇళ్ళ మధ్యలో నిలబడి దుర్వాసన వస్తున్నది.ముఖ్యంగా మండలి పురంలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసి పోయి ఆనీరు ఎటు కదలకుండా నిల్వ ఉండుట వలన భరించలేని దుర్వాసన వస్తున్నది. ప్రజలు ఈ నీళ్లలోనుండి నడిచి వారి ఇళ్లలోకి వెళ్ళాలి. ఈ మండలి పురంలో ప్రజలు త్రాగటానికి మంచి నీటి కుళాయిలు కూడ ఈ మురుగు నీళ్ళలో ఉండటం వలన మోకాలు లోతు మురుగు నీళ్లలో దిగి మహిళలు మంచినీళ్లు పట్టుకొని త్రాగుచున్నారు.  అదే విధంగా గత ప్రభుత్వం రోడ్డులు వేచే నిమిత్తం ఇళ్లముందు ఉన్న డ్రైనేజీలు పగలు కొట్టటం వలన మురుగు నీరు రోడ్డు మీదకు వస్తున్నాయి. వర్ష కాలం మొదటిలోనే ఇలా ఉంటే ఇంకా పెద్ద వర్షాలు పడితే ప్రజలు మా పరిస్థితి ఏమిటి అని భయపడుతున్నారు. అలాగే మండలిపురంలో నిరుపేదలకు ఇచ్చే ఇళ్లస్థలాలు లే అవుట్ చూస్తే ఇప్పుడే పెద్ద చెరువును తలపిస్తుంది. గతంలో ఏర్పడిన కాలనీలలో మురుగు నీరు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, అసలు ముంపుకు గురిఅయ్యే ఈ ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఎలా ఇస్తారు? అసలు ప్రజలు ఇల్లు ఎలా కట్టుకొని, అందులో ఉంటారో అధికారులు ఒక్క సారి అయినా ఆలోచన చేయాలని స్థానిక ప్రజలు అధికార్లకు పలుమార్లు విన్నవించుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు.  కావున ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ MLA గారు స్పందించి, అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీలు అన్నిటిలోను ఇళ్ల మధ్యలో నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు తోడించే ఏర్పాటు చేయించవలచినదిగా జనసేన పార్టీ తరుపున కోరుచున్నారు. ప్రస్తుతం ప్రజలు కోవిడ్ -19 వైరస్ భయంతో బ్రతుకుచున్నారు. అన్ని కాలనీలలో ఉన్న మురుగు నీరు తోడించి బ్లీచింగ్ పౌడర్, దోమల మందు కొట్టించగలరని కాలనీ వాసులు కోరారు.  ఈ కార్యక్రమం లో మండలి పురం మహిళలు వెంకటేశ్వరమ్మ, అప్పికట్ల ప్రమీల, E. మాదవి, y. నాగలక్ష్మి, k. జయశ్రీ, p. శివ పార్వతి, గుంటూరు విజయ, రమాదేవి, జనసైనికులు p. హరి కృష్ణ, చందు, బాబ్జి, కోసూరు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

See also  మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం