పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోవు అమరనాథ్ : జనసేన నాయకులు ఆదాడ మోహనరావు

అమరనాథ్

         విజయనగరం ( జనస్వరం ) :  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమరనాథ్ ఫై జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు తీవ్రంగా ఖండిస్తూ మండిపడ్డారు. మంగళవారం ఉదయం మోహనరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర మంత్రి వర్గమంతా తిట్లు తిట్టడంలో అరితేరినవారికే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చినట్లు ఉందని,సభ్యత, సంస్కారం లేకుండా విచక్షణకోల్పోయి నోటికి ఏది బడితే అది పిచ్చికుక్కల్లా జనసేన పార్టీ పైన, అధినేత పవన్ కళ్యాణ్ పైన మదమెక్కి వాగుతున్నారని, మంత్రులు అంతా వాగుడు తగ్గించుకోకపోతే ఎలా బుద్ది చెప్పాలో తెలుసునని, ప్రజలంతా గమనిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదు అని వైస్సార్సీపీ మంత్రులు గమనించుకోవాలని వారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే, ఓర్వలేక సన్నాసి మంత్రులంతా వ్యక్తిగత దాడులు చేస్తున్నారని, ఈ దిగజారుడు రాజకీయానికి జనసేన తొందరలోనే సరియైన గుణపాఠం చెబుతుందని, భూఖబ్జాలు చేసి,అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ లు వేసిన మంత్రి గుడివాడ అమరనాథ్ పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా సరిపోవు అని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), వంక నరసింగరావు, సారికి మురళి మోహన్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  కాకినాడలో జనం కోసం పవన్ - పవన్ కోసం మనం కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి