జనసేనాని జన్మదిన సందర్భంగా కడపలోని సీఎం బలిజపల్లి గ్రామం తరపున 2 ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ

జనసేనాని జన్మదిన సందర్భంగా కడపలోని సీఎం బలిజపల్లి గ్రామం తరపున 2 ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ

                  జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా సీఎం బలిజపల్లి గ్రామం తరపున 2 ఆక్సిజన్ సిలిండర్ కిట్లు  అందించారు జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మాట్లాడుతూ  కరోనా కోరల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది పౌరులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసును తీవ్రంగా కలిచివేసింది. జనసైనికులు అందరూ కూడా రాష్ట్రంలోని కోవిడ్  ఆసుపత్రులలో ఉన్నటువంటి  ఆక్సిజన్ సిలిండర్ కొరత విషయాన్ని గమనించి ఈ సంవత్సరం జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు అన్నారు. అనుకున్నదే తడవుగా మా గ్రామం తరుపున రెండు ఆక్సిజన్ సిలెండర్లు ఇవ్వడం జరిగింది అన్నారు. మేము చేసే ఈ చిరు సాయం కారణంగా ఎంతో విలువైనటువంటి ప్రజల ప్రాణాలు రక్షించబడడమే జనసేనానికి మేము అందించే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఈ ఆక్సిజన్ యునిట్స్ ద్వారా  హాస్పిటల్ లో వైద్య సేవలు అందుకుంటున్న సామాన్య ప్రజానీకానికి మరిన్ని మెరుగైన సేవలు అందించబడతాయని సహృదయంతో ఆకాంక్షిస్తున్నామని అన్నారు.

1. రైల్వే కోడూర్ ప్రభుత్వ ఆసుపత్రి (కడప జిల్లా)
2. ఓబులవారిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి (కడప జిల్లా)

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి జనసేన ఆక్సీజెన్ సిలిండర్ కోఆర్డినేటర్ తాతంశెట్టి నాగేంద్ర, కోడూర్ జనసేన కార్యకర్తలు మని, కిశోర్ , మరియు గంగాధర, రమణ, బాలాజీ, సురేంద్ర, వెంకటేష్, సురేష్, అనెప్పు సురేష్, ఎలిశెట్టి గంగాధర్, నవీన్, దిలీప్, సతీష్ , నాని, ఉమేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  వర్షంలో మోకాలు మీద నిరసన కార్యక్రమం తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు