ఆముదాలవలస, (జనస్వరం) :శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గములో ఇటీవలే ప్రమాదానికి గురి అయ్యి ఒక నిరుపేద కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో 15వేల రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ భవిష్యత్తులో ఏటువంటి కష్టం వచ్చిన, ఏ పరిస్థితిలోనైన మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ అంపిలి.విక్రమ్, సంగం నాయుడు, కొల్ల.జైరాం, తులగాపు.మౌళి, రాంసాయి, కృష్ణ, కొత్తకోట. శ్రీను, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.