పవన్ కళ్యాణ్ జన్మదిన నాటికి లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్నిమొదలుపెట్టిన జనసైనికులు

పవన్ కళ్యాణ్ జన్మదిన నాటికి లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్నిమొదలుపెట్టిన జనసైనికులు. 

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన రోజు సెప్టెంబర్ 2 న రానుంది. ఆ రోజు  సందర్భంగా అన్ని నియోజకవర్గాల జనసేన టీం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులతో, జనసైనికులతో, వీరమహిళలతో చెట్లు నాటే బిగ్ ఛాలంజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆ ఛాలంజ్ ని స్వీకరిస్తూ ఈరోజున జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసైనికులతో కలిసి నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కొన్ని మొక్కలని నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ జనసేన ముఖ్య ఉదేశాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, అదే విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెలకొన్న అనేకరకాల ఫ్యాక్టరీ ల వలన వెదజల్లుతున్న కాలుష్యం కోరల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నందున,  అందులో ఒక భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి ఒక్కరు వారి సొంత బాధ్యతగా తీసుకుని వాళ్ళ పరిధిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, తరుణ్, త్రిశాంత్, హేమంత్, శ్రావణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

See also  కదిరి టౌన్ 34వ వార్డులో జనసేనపార్టీ కమిటీ ఎంపిక