రేపల్లె నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

రేపల్లె

గుంటూరు ( జనస్వరం ) :  రేపల్లె నియోజకవర్గం నగరంలో జనసేన పార్టీ  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు  రేపల్లె పట్టణం, రేపల్లె నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి 4 మండలాల నుండి జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నామీద ఇష్ట-అయిష్టతతోనో, వేరొకరిమీద ఇష్ట-ఆయిష్టతతో కాకుండా జనసేనాని మీద, వారి యొక్క భావజాల స్పూర్తితో పనిచేసి 2024 ఆంధ్రప్రదేశ్ సీయంగా పవన్ కల్యాణ్ గారిని చూసేలా చేయాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేయుచున్నపుడు అధికార ప్రభుత్వం ఒత్తిళ్ళు, చట్టపరమైన అవాంతరాలు ఏర్పడితే వెంటనే తమకు తెలియపరిస్తే, జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలను గుర్తించి మండల కమిటీల తద్వారా గ్రామ కమిటీలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన మత్తి భాస్కర రావు, సమావేశ స్థలం మరియు సమావేశానంతర భోజన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గోపరాజు ఉదయ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మత్తి భాస్కర రావు, సంయుక్త కార్యదర్శి ఛందోలు ప్రసాద్, 4 మండల జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  "యువశక్తి" పోస్టర్లును ఆవిష్కరించిన కొత్తవలస జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి