అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కోసం వినతిపత్రం అందించిన కందుకూరు అంబేద్కర్ యువత

అంబేద్కర్

          అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం మండలం, కందుకూరు గ్రామంలోని అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలోని అధికారులని కలసి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. యువ నాయకులు మాట్లాడుతూ యువత అంతా కలసి “ అంబేద్కర్ యువత ” గా ఒక సంఘముగా కలసికట్టుగా ఏర్పడ్డాము. ఈ సంఘము ఆధ్వర్యంలో గతంలో కందుకూరు గ్రామము నందు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. గ్రామ ప్రజలలో సామాజిక స్పృహ కలిగించేలా, వారిలో అభివృద్ధి చైతన్యాన్ని నింపేలా కార్యక్రమాలు చేశాము. ప్రభుత్వం చేపట్టినటువంటి “ స్వచ్చ భారత్ ” లాంటి కార్యక్రమాలు కందుకూరు గ్రామంలో నిర్వహించి ప్రజలలో చెత్త మీద అవగాహన కల్పించాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము. కరోనా విపత్కర సమయంలో గ్రామ ప్రజలకు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పిస్తూ, కొద్దిమందికి మాస్కులు, శానిటైజర్స్ ను అందించాము. భారత రాజ్యాంగాన్ని రాసిన, నిమ్న వర్గాలకు అండగా నిలిచిన భారతరత్న గ్రహీత శ్రీ డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కందుకూరు గ్రామం, ఎస్సీ కాలనీ నందు ఆవిష్కరించడానికి నిర్ణయించుకున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరామన్నారు. గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉన్న వి‌ఆర్‌ఓ గోవిందులు నాయక్ సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామ పంచాయితీ జెడ్‌పి‌టి‌సి పెద్దప్పయ్య సానుకూలంగా స్పందించి పరిష్కారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువత సాకే రవి, సాకే నరేష్, సాకే మహేంద్ర, సాకే మురళి, సాకే వంశీ, సాకే శివకుమార్, సాకే నరేష్, భరత్, మంజునాథ్, ఆనంద్, వినోద్, శివ, మహేష్, రాజేష్ మరియు గ్రామస్తులు సుధీర్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. 

See also  ఈతకోట గ్రామంలో గళ్ళ సత్యనారాయణ కుటుంబానికి 1,00,000 రూపాయల బాండు అందించిన కొత్తపేట జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి