అమరవీరుల దినోత్సవం సందర్భంగా అవుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

     అవుకు, (జనస్వరం) : బనగానపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గారి ఆదేశాల మేరకు అవుకు పట్టణంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అవుకు జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ లు మాట్లాడుతూ స్వతంత్ర్య పోరాటంలో ఎంతోమంది నాయకులు, సాధారణ ప్రజలు చనిపోయారని వీరందరి త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు మార్చి 23న అమరవీరుల దినాన్ని నిర్వహిస్తారు. 1931లో ఇదే రోజు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిషర్లు పాకిస్థాన్ లోని లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురిని ఉరి తీశారని అన్నారు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని అన్యాయం, అక్రమాలపై ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసి రామ్, సింహాద్రి, చిన్న, ప్రసాద్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

See also  వరద ముంపు ప్రాంతాలలో 5వ రోజు పర్యటించిన ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్