జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 30 వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 30 వ రోజు సేవాదానం

             జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు మల్లెం రెడ్డయ్య మరియు వారి కుమారుడు మల్లెం గౌతమ్ గార్ల ఆధ్వర్యంలో కడప నగరంలోని 1) పద్మవతి వేంకటేశ్వర వృద్ధాశ్రమం 2) అదరణ నిరాశ్రయుల ఆశ్రమం కడప నిరాశ్రయుల ఆశ్రమంలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్న ఇలాంటి విషయాలు ఇటువంటి సమయాలలో చాలా ఆనందాన్ని ఇస్తాయి జనహృదయనేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాల్లో భాగంగా 30వ కార్యక్రమం ఈ రోజు కడప నగరంలోని వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది వృద్ధుల, నిరుపేద అభాగ్యుల ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు కలకాలం మా పవన్ కళ్యాణ్ పైనే ఉండాలని ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇలా వృద్ధుల నిరుపేద అభాగ్యుల మధ్యన వారికి ఒక పూట అన్నదానం చేసి జరుపుకునేలా చేసిన జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి, మరియు ఈ రోజు కార్యక్రమం దాతలు మల్లెం రెడ్డయ్య గారికి కడప జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్ రవి ప్రసాద్, పద్మావతి వెంకటేశ్వర వృద్ధాశ్రమం ఫౌండర్, రాంబాబు  ఆదరణ నిరాశ్రయుల ఆశ్రమం ఫౌండర్, విజయ్ బాబు, ప్రేమలయ నిరాశ్రయుల ఆశ్రమం ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి, జనసైనికులు బాలునాయక్, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు. 

See also  చట్టాలను అమలుపరిచే బలమైన న్యాయవ్యవస్థ రూపకల్పన జరగాలి : జనసేన నాయకులు యుగంధర్ పొన్నాల